తిప్ప తీగ 



తిప్పతీగ ఇచ్చే ఆరోగ్యప్రయోజనాలు అద్భుతమైనవి అనడంలో అతిశయోక్తి లేదు. మెరుగైన 

రోగనిరోధక శక్తి కోసం ఆయుర్వేదం అందించే మరో సూపర్‌ఫుడ్ ఇది. ఆయుర్వేదంలో 

'అమృతం'గా ప్రసిద్ది చెందింది. పురాతన కాలం నుండి భారతీయ వైద్యంలో ఉపయోగంలో ఉన్న 

తిప్పతీగ మొక్కలో పుష్కలంగా ఔషధ గుణాలు ఉన్నాయి. తిప్పతీగ కాండం సహా ఆకు వరకు 

అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది.

1. తిప్ప తీగతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

హృదయం ఆకారంలో ఉండే ఈ మూలిక సహజంగా యాంటీ ఆక్సిడెంట్స్‌తో నిండి ఉంటుంది. 

ఇది ఫ్రీ రాడికల్స్, వ్యాధిని కలిగించే క్రిములతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది 

టాక్సిన్స్‌ను తొలగించడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో, కాలేయ వ్యాధిని ఎదుర్కోవడంలో, 

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లను ఎదుర్కోవడంలో మన శరీరానికి సహాయపడుతుంది.

యాంటీ-పైరేటిక్ స్వభావం కలిగి ఉండటం వలన ఇది దీర్ఘకాలిక జ్వరాలతో పోరాడటానికి కూడా 

సహాయపడుతుంది. డెంగ్యూ ఉన్నప్పుడు కూడా సిఫారసు చేస్తారు. తిప్పతీగ మన రోగనిరోధక 

శక్తిని బలోపేతం చేస్తుంది

2. డయాబెటిస్ నివారణకు తిప్పతీగ

మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా డయాబెటిస్‌ను అదుపు చేయడంలో 

తిప్పతీగ మీకు సహాయపడుతుంది. వివిధ రకాల ఫైటోకెమికల్స్ శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని 

తగ్గించడం, సహజ ఇన్సులిన్ స్రావాన్ని పెంచడానికి పని చేస్తాయి. జర్నల్ ఏన్షియంట్ సైన్స్ 

ఆఫ్ లైఫ్‌లో ప్రచురించిన 2010 పరిశోధనా పత్రం కూడా తిప్పతీగ లేదా టినోస్పోరా కాలేయంలో 

మధుమేహం-ప్రేరిత ఆక్సీకరణ ఒత్తిడిని గణనీయంగా ఎదుర్కొంటుందని పేర్కొంది.

3. శ్వాస సంబంధిత సమస్యలతో పోరాడే తిప్పతీగ
 
తిప్ప తీగలో కనిపించే అద్భుతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ శక్తులు తరచుగా దగ్గు, జలుబు, 

టాన్సిలిటిస్ వంటి ఏవైనా సాధారణ శ్వాసకోశ సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయి. 

జలుబు, దగ్గు మాత్రమే కాకుండా, ఇది ఉబ్బసం రోగులకు కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఛాతీ 

బిగుతుగా ఉండడం, శ్వాస ఆడకపోవడం, దగ్గు, గురక వంటి లక్షణాలను తిప్పతీగ తగ్గిస్తుంది.

4. ఒత్తిడి, ఆందోళనను తగ్గించే తిప్పతీగ

తిప్పతీగను అడాప్టోజెనిక్ హెర్బ్‌గా ఉపయోగించవచ్చు. అడాప్టోజెన్ అనేది ప్రాథమికంగా మన 

శరీరం ఒత్తిడికి అనుగుణంగా సహాయపడే పదార్ధం. ఈ ఆరోగ్య టానిక్ మన శరీరం నుంచి టాక్సిన్స్ 

బయటపడటానికి, మన జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అందువల్ల ఇది మనల్ని 

ప్రశాంతంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

5. గుండె జబ్బుల నుంచి రక్షణకు తిప్పతీగ

డయాబెటిక్ ఎలుకలలో తిప్పతీగ ప్రభావాలను జర్నల్ ఆఫ్ ఎత్నోఫార్మకాలజీలో ప్రచురించిన 

ఒక పరిశోధనా పత్రం అధ్యయనం చేసింది. ఇది డయాబెటిక్ ఎలుకలలో సీరం కొలెస్ట్రాల్ 

స్థాయిలను గణనీయంగా తగ్గించిందని కనుగొన్నారు. తిప్పతీగ లిపిడ్ జీవక్రియను సక్రమంగా 

ఉండేలా చేస్తుంది. తద్వారా మీ గుండెకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని మరొక 

అధ్యయనం కనుగొంది.

6. మహిళల్లో బోలు ఎముకల వ్యాధిని నివారించే తిప్పతీగ

తిప్పతీగ కాండం మహిళల్లో బోలు ఎముకల వ్యాధిని ప్రభావితం చేస్తుందని యూరోపియన్ 

మెనోపాజ్, ఆండ్రోపాజ్ సొసైటీ యొక్క అధికారిక జర్నల్ అయిన మాట్యురిటాస్‌లో 

ప్రచురితమైన ఒక అధ్యయనం తెలిపింది. తద్వారా బోలు ఎముకల వ్యాధి నివారణలో

ఉపయోగపడుతుందని తేల్చింది.

అందరూ ఇంటిలో మనీ ప్లాంట్ పెంచుకుంటారు కానీ తిప్పతీగ పెంచుకోండి అన్ని రకాలుగా 

మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.


తిప్పతీగ, ఆకు వేరు చాలా విలువ కలిగినవి. 

అప్పుడప్పుడు తిప్పతీగ ఆకుని డైరెక్ట్ గానమిలి మింగవచ్చు, లేదా ఆకుల్ని మిక్సీలో వేసి ముద్దగా 

చేసి ఉండలుగా చేసి ఆరబెట్టుకొని గోలీలుగా చేసుకొని మింగొచ్చు. సహజంగా ఇమ్యూనిటీకోసం 

రోజుకు ఒక ఆకు సరిపోతుంది. 
 


తిప్పతీగ చాలా వేడి చేస్తుంది. మంచిదని అధిక మోతాదులో పొరపాటున కూడా తీసుకోకూడదు. 

రెండు మూడు తిప్పతీగ ఆకుల్ని వేసి రెండు గ్లాసు నీళ్లు పోసి ఒక గ్లాసు అయ్యేలా మరిగించి 

అందులో కాసింత మిర్యాల పొడి కలుపుకొని తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీకి చాలా బాగా 

పనిచేస్తుంది వారానికి మూడుసార్లు తీసుకోవచ్చు.

డయాబెటిస్ ఉన్నవాళ్లు ఇంతకుముందు చెప్పినట్లు గోలీలుగా చేసుకొని ఆరబెట్టి నిల్వ 

ఉంచుకోవచ్చు.రోజుకి మూడు గోలీల చొప్పున ఉదయం పరగడుపున తీసుకోవచ్చు. 

గోలి సైజు చిన్న కుంకుడు గింజంత పరిమాణంలో ఉంటే సరిపోతుంది. 

తిప్పతీగ ఆకు కంటే దాని వేరులోనూ, తీగలోను, ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

ప్రమాదం గా మారిన అమ్మలు - అమ్మాయిల ఆరోగ్యం 
ఆడవారి  ఆహార నియమలపై మిల్లెట్ రాంబాబు గారి సూచనలు 

 

 

అరటి పండులో సహజ సిద్దమైన చక్కెరలు, పీచు పదార్ధాలు సమృద్దిగా వుంటాయి. గంటన్నర

శ్రమకు తగిన శక్తి రెందు అరటి పళ్ళు అందిస్తాయి. మనం టివిలో తరచూ చూస్తుంటాము

ప్రపంచ టెన్నిస్ ఆగటగాలళ్ళు ఆటమద్య విరామ సమయములో రెందు పళ్ళు తినటం

శక్తినివ్వటమే కాదు, అనేక రోగాలను నిరోదించే గుణం కలది. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడికి లోనైన

వారు ఈఫలం తీసుకుంటె ఒత్తిడి తగ్గి మనస్సు ప్రసాంతంగా ఉంటుంది. ఇందులో వుండే బి6

విటమిన్ రక్తంలోని చక్కర మోతాదుని నియంత్రిస్తుంది. దీనిలో ఇనుప ధాతువులు రక్తంలోని 

ఎర్రకణాలను వృద్ది చేస్తాయి. దీనిలో వుండే అధికశాతం పొటాషియం వలన రక్తపుపోటుని 

అదుపులో వుంచి పక్షవాతం రాకుండా ఆపుంది. దీనిలోని అధిక పీచు పదార్ధం వలన 

మలబద్దకాన్ని నివారిస్తుంది. దీనిని ప్రతిరోజూ ఏదో ఒకసమయంలో భుజించుట వలన మెదడుకి 

చురుకుదనం పెరుగుతుంది.


ముఖ్యంగా విద్యార్థులలో గ్రహణ శక్తిని పెంపోందిస్తుంది. చాతిలో మంటను తగ్గిస్తుంది. 

వేవిళ్ళలతో బాధపడె మహిళలు వీటిని తింటే చాలా ఉపశమనం కలుగుతుంది.

దోమకాటు వలన వచ్చే వాపు, మంటకు పరటి పండు తొక్కలోపలి భాగంతో రుద్దితే తక్షణం 

ఉపశమనం కలుతుంది.దీనిలో ఉండే బి విటమిన్ నాడీమండలానికి మేలు చేస్తుంది. చిప్సు, 

చాక్లెట్లు తినడం మాని అరటిపండ్లను తినడం వల్ల మానిసిక ఒత్తిడిని తగ్గించటమే కాకుండా 

ఊబకాయాన్ని నివారిస్తుంది. కడుపులో పుండ్లను (Ulcers) నివారించుటలో మేటిఫలం. మానసిక 

ప్రశాంతత కలిగించుటలో ఈ పండును మొదట చెప్పుకోవాలి._


ధాయ్ లాండ్ దేశంలో గర్బిణి స్త్రీలు విధిగా వీటిని తినటం ద్వారా పుట్టబోయే పిల్లలు సాత్విక 

స్వభావులుగా వుంటారని నమ్ముతారు.


ఋతువుల మార్పువలన వచ్చే అనేక సమస్యలకు విరుగుడు ఈఫలమే! పొగ తాగే అలవాటుని 

మానిపించుటలో అరటి పండును గురించి ఆలోచించాలి. 


ఒత్తిడి తగ్గించేందుకు భోజన విరామ సమయంలో చిరు తిండిగా తీసుకుంటే ప్రయోజనం 

ఉంటుంది. క్రమం తప్పకుండా ఈ పండును తినే వారికి పక్షవాతం లాంటి వ్యాధులు వచ్చే 

అవకాశం లేదు. ఉలిపిరి కాయలను నిర్మూలించాలంటే అరటి పండు తొక్క లోపలి భాగం

ఉలిపిర్ల మీద పెట్టి కదలకుండా ప్లాస్టరుని అతికించినచో క్రమంగా తగ్గుతాయి. 

ఆపిల్ తో పోలిస్తే నాలుగురెట్లు మాంసకృత్తులు, రెట్టింపు పిండి పదార్ధాలు, మూడురెట్లు భాస్వరం, 

ఐదురెట్లు విటమిన్ -ఎ కలిగివుంది.

*మీ కాలి బూటు మెరుపు తగ్గిందా.. అరటి పండు తొక్క లోపలి భాగంతో రుద్దండి ఆ తరువాత పాలిష్ చేయండి, మెరిసి పోతూ ఉంటుంది.