కరివేపాకు సూప్
(కరివేపాకు తో వెయిట్ లాస్ మరియు సంపూర్ణ ఆరోగ్యం పొందే ఒక రిసీపీ)
కరివేపాకులో పలు రకాల ఔషధ గుణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున ఇది
'ఆయుర్వేద నిధి' గా పరిగణించబడుతుంది.
కరివేపాకు సూప్ తయారుచేసుకోవడం చాలా సులువు. ఒక పాన్‌లో ఒక కప్పు నీటిని మరిగించాలి.
గ్యాస్ ఆఫ్ చేసి, ఆ నీటిలో కరివేపాకు ఆకులను వేయాలి. కాసింత మిరియాలు, దాల్చిన చెక్క,
లవంగం వేసి, ఆ సూప్ కలర్ మారే వరకు ఉంచి, ఆపై కరివేపాకు ఆకులను తీసేయాలి.
అనంతరం ఆ సూప్ తాగాలి.
కరివేపాకు సూప్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
బరువు తగ్గడానికి:
కరివేపాకు సూప్ బరువు తగ్గించే పానీయంగా ఉపయోగించవచ్చు. దీని వినియోగం ఊబకాయాన్ని
తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్‌ను త్వరగా తగ్గించడంలో సహాయపడుతుంది. వాడిన ఒక వారం
రోజుల నుంచే తేడా గమనించవచ్చు.
మెరుగైన జీర్ణక్రియ:
జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా కరివేపాకు, కరివేపాకు సూప్ను
తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో లాక్సిటివ్‌లు ఉంటాయి. దీని వల్ల గ్యాస్, మలబద్ధకం,
విరేచనాలు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.
శరీర నిర్విషీకరణ
కరివేపాకు నీటిని తాగడం వల్ల శరీరం నుంచి విష మలిణా లు తొలగిపోతాయి. వాస్తవానికి ఈ
ఆకులలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు శరీర నిర్విషీకరణకు సహాయపడతాయి. చర్మ ఇన్ఫెక్షన్లు,
చర్మ సమస్యలు మరియు ఫ్రీ రాడికల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
మానసిక ఒత్తిడి దూరం:
ప్రస్తుత కాలంలో చాలా మంది మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పనిభారం, డబ్బు,
అనారోగ్యం మొదలైన కారణాలతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కరివేపాకు సూప్ తాగితే
టెన్షన్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది.
గమనిక:
కరివేపాకు కాషాయమే తీసుకోవాలని ఏం లేదు, ఒక పిటికెడు కరివేపాకును ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్
పాటు తీసుకోవడం ద్వారా పైన చెప్పిన లాభాలు అన్నీ కూడా కలుగుతాయి. అయితే బాగా నమిలి
తినాలి.
No comments:
Post a Comment