పాజిటివ్ మాట్లాడండి... ప్రతి అణువూ వింటుంది! 

(1 వ భాగము) ఈనాడు సౌజన్యం తో 

ఒక రాజ్యంలోని ప్రజల మంచీచెడూ చూసుకోవాల్సిన బాధ్యత దాన్ని పాలించే రాజుదే కదా. 

ఆ ప్రజల సంక్షేమం గురించి రాజు ఎంత బాగా పట్టించుకుంటే వాళ్లూ అంత బాగా తమ 

కర్తవ్యాల్నినిర్వర్తిస్తారు. రాజ్యం ప్రశాంతంగా ఉంటుంది. మీ శరీరాన్నే ఒక రాజ్యం

అనుకుంటే దానికి రాజు మీరే. శరీరంలోని కణాలన్నీ మీ ప్రజలు. రాజుగా మీ బాధ్యత 

ఆ కణాల బాగోగులు చూడడం అప్పుడే అవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

మరి వాటి గురించి మీరు పట్టించుకుంటున్నారా..?


ఆమె నవ్వితే మొహమంతా నవ్వినట్లుంటుంది. 

అతనికి అణువణువునా పొగరే...

వాడికి ఆ స్వభావం నరనరానా జీర్ణించుకుపోయింది...

ఇలాంటి మాటలు తరచూ వింటూనే ఉంటాం. 

నవ్వితే పెదవులు కదుల్తాయి కానీ ముఖమంతా

ఎందుకు నవ్వుతుంది...?

పొగరైనా స్వభావమైనా మాటతీరులో పనితనంలో కన్పిస్తుంది కానీ ఒంట్లో ఎలా కన్పిస్తుంది?

ఎందుకూ అంటే ఆయా భావాలకు వారిలోని అణువణువూ స్పందించడం వల్ల కన్పిస్తుంది.

శరీరం ఎప్పుడు స్పందిస్తుందలా? మనస్ఫూర్తిగా ఆ భావాన్ని ఆవహించుకున్నప్పుడు...!

మనసారా నవ్వితే... ముఖంలోని ప్రతి కణం ఉత్తేజితమవుతుంది. ఏ భావమైనా అంతే. 

అందుకే ఇలాంటి మాటలు వాడుకలోకి వచ్చాయి.



No comments:

Post a Comment