పాజిటివ్ మాట్లాడండి... ప్రతి అణువూ వింటుంది! 

(2 వ భాగము)  ఈనాడు సౌజన్యం తో 

'మనం' అంటే మన మనసూ ఆలోచనలూ మాత్రమే కాదు, మన శరీరమూ, అందులోని 

భాగాలూ, బయటికి కన్పించేవీ, లోపల ఉన్నవీ... అన్నీ కలిస్తేనే 'మనం'.


పైకి కన్పించే శరీరాన్ని రోజూ చూసుకుంటూనే ఉంటాం కానీ, లోపలి శరీరం గురించి ఎప్పుడన్నా

ఆలోచించారా? ఏముంటుందీ... రక్తమాంసాల ముద్దలేగా అనుకుంటాం. కానే కాదు,

అదో అద్భుతం. కొన్ని లక్షల కోట్ల కణాలు కలిసి ఏర్పడిన ఈ శరీరంలో ఒక్కో కణం ఒక్కో చిన్న 

ఫ్యాక్టరీలాగా పనిచేస్తుంది. ప్రతి కణమూ శరీరానికి కావలసిన ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది, 

శక్తినిచ్చే ఇంధనాన్ని తయారు చేసుకుంటుంది, సంక్లిష్టమైన కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ని కలిగి 

ఉంటుంది. ప్రతి కణమూ దేనికదే స్వతంత్ర యూనిట్‌ అయినప్పటికీ కణాలన్నీ సమష్టిగా 

పనిచేస్తాయి. మెదడు చెప్పేది వింటాయి. దానికి స్పందిస్తాయి. తమలో తాము 

మాట్లాడుకుంటాయి. దూరంగా ఉన్నవాటికి సైగలు చేస్తాయి. సంకేతాలు పంపుతాయి. అలాగని 

అవేమీ స్థిరంగా ఉండవు. నిరంతరం విభజనకు లోనవుతూ ఉంటాయి. కొన్నిటి జీవితకాలం 

కేవలం కొన్ని గంటలే. మరికొన్ని నాలుగు నెలల దాకా జీవించి ఉంటాయి. మన శరీరంలో 80 

విభిన్న అవయవాలుంటే, 200 రకాల కణాలుంటాయి. సగటు మనిషి శరీరంలో 87.2 

ట్రిలియన్ల కణజాలాలుండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. 

కణాల పనితీరు గురించి ఎప్పటికప్పుడు మరింత లోతుగా అధ్యయనం చేయడం

ద్వారా శాస్త్రవేత్తలు రకరకాల జబ్బులకు కారణాల్నీ చికిత్సల్నీ కనుక్కుంటుంటే,

మరోపక్క మానసిక శాస్త్రవేత్తలేమో వాటికి సరైన సూచనలివ్వడం ద్వారా కొన్ని

సమస్యల్ని రాకుండానే నివారించవచ్చంటున్నారు.


No comments:

Post a Comment