పాజిటివ్ మాట్లాడండి... ప్రతి అణువూ వింటుంది!
(3 వ భాగము) ఈనాడు సౌజన్యం తో
జీవితకాలం ఇవి ఏమేం పనులు చేయాలీ అన్నదాన్ని కణంలో ఉండే న్యూక్లియస్ నిర్దేశిస్తుంది.
అంటే ప్రతి కణానికీ దాని పనికి సంబంధించి ఒక రూల్ బుక్ ఉంటుందన్నమాట.
దాన్నే "హ్యూమన్ జీనోమ్' అంటున్నాం. అయితే పుట్టుకతో వచ్చిన ఈ జీనోమ్‌ని
జీవితాంతం భరించనక్కరలేదనీ, కంప్యూటర్ ప్రోగ్రామ్ లాగే దీన్నీ తిరగరాసుకోవచ్చనీ
అంటున్నారు శాస్త్రవేత్తలు.
గర్భంలోని శిశువు తల్లి ఆలోచనలకు స్పందించడం మనకు తెలుసు. పసిపిల్లలుగా
ఉన్నప్పుడు తల్లి కన్పించకపోతే భయం, ఎవరైనా ఎత్తుకుంటే పడేస్తారేమోనని భయం...
అలా ప్రాణభయంతో మొదలై వయసుతో పాటు మారుతూ పెద్దయ్యేసరికి డీఫాల్ట్‌గా
ఒత్తిడి రూపంలో మన శరీరమనే కంప్యూటర్‌లో ప్రోగ్రామ్ అయిపోతోంది.
అవుట్ డేట్ అయిపోయిన ఈ సాఫ్ట్‌వేర్‌ని మనం పాజిటివ్ థింకింగ్ అనే సాఫ్ట్‌వేర్‌తో
రీప్రోగ్రామ్ చేయకపోతే మన భావాలకీ ఆలోచనలకీ మనమే బాధితులుగా మిగిలిపోతాం
అంటున్నారు పరిశోధకులు. జీన్ ఎడిటింగ్ లాంటి ప్రక్రియలతో అటు వాళ్లూ
మెదడుకిచ్చే సూచనలతో ఇటు మనస్తత్వ శాస్త్రవేత్తలూ ప్రయోగాలు చేస్తున్నారు.
మన శరీరంలోని కోట్లాది కళాలూ మన మాట వింటాయి. మన ఆజ్ఞ కోసం
ఎదురుచూస్తుంటాయి. మనం చేయాల్సిందల్లా కెప్టెన్‌లాగా ఆజ్ఞలు ఇవ్వడమే.
అణురూపంలోని ఈ సేవకులన్నీ దాన్ని ఉత్సాహంగా ఆచరణలో పెడతాయి.
అది నోటి మాటగానే చెప్పనక్కరలేదు. మనసులో ఆలోచనగా ఉన్నా చాలు,
నాడీవ్యవస్థ ద్వారా మొత్తం శరీరంలోని కణాలన్నిటినీ చేరుతుంది...
అని చెబుతున్నారు ఈ పరిశోధకులు. కానీ మనమేం చేస్తున్నాం..?
మీరు ఒక జలాంతర్గామికి కమాండర్‌గా ఉన్నారనుకుందాం. పెరిస్కోప్ లోనుంచి చూస్తే
ఎదురుగా పెద్ద మంచుకొండలు, రెండుపక్కలా పొంచి ఉన్న శత్రుసైన్యం,
వెనకాల ఏముందో తెలియకుండా దట్టంగా మంచు... కనపడతాయి.
ఇదే నివేదికని మీరు లోపలున్న వాళ్లకి పంపిస్తారు. వాళ్లు బయటికి చూడలేరు
కాబట్టి మీరు చెప్పిందే నమ్ముతారు. అన్నిపక్కలా సమస్యలే ఉన్నప్పుడు
చేయగలిగిందేముంది అనుకుని నిరాశతో ప్రయత్నమే చేయకుండా
శత్రువుకి లొంగిపోతారు. అచ్చం ఆ సబ్‌మెరైన్ కమాండర్ పంపినట్లు
నెగెటివ్ రిపోర్టు నిత్యం మనం కణాలకు పంపుతున్నాం. వాటిని నిర్వీర్యం చేస్తున్నాం.
తెల్లారి లేస్తే మనకెన్నో ఫిర్యాదులు. ఆరోగ్యమూ, ఆర్థిక విషయాలూ, పిల్లలూ,
పెద్దలూ, ఉద్యోగమూ, వ్యాపారమూ... ఏదో ఒక ఫిర్యాదుతోనే రోజు మొదలవుతుంది.
మాటల్లో వద్దు, కాదు, కూడదు... లాంటి పదాలూ నెగెటివ్ వాక్యాలే ఎక్కువగా ఉంటాయి.
No comments:
Post a Comment