పాజిటివ్ మాట్లాడండి... ప్రతి అణువూ వింటుంది!
(4 వ భాగము) ఈనాడు సౌజన్యం తో
కొందరు ఆరోగ్యం గురించి రకరకాలుగా తమకు తామే ఊహించుకుని పెద్ద పెద్ద
రోగాల పేర్లు చెబుతూంటారు. అలాంటి మాటల్ని ఎన్నోసార్లు విన్న కణాలకు
అది సజెషన్ లాగా అనిపిస్తుంది. దాన్ని వారి కోరికగా భావించి అమలు చేసేస్తాయి.
అలా కాకుండా 'నాకేం దిట్టంగా ఉన్నాను. దేన్నయినా జీర్ణించుకోగలను' అన్నారనుకోండి,
అప్పుడు పొట్టలోని కణాలు కూడా అలాగే పనిచేయడానికి ప్రయత్నిస్తాయి.
మనమేమో ఏదైనా సమస్య ఉంటేనే దాని గురించి మాట్లాడతాం కానీ, అంతా బాగుంటే
అసలు శరీరం గురించి పట్టించుకోం.
వ్యసనపరులను చూస్తూనే ఉంటాం కదా. అలవాటైపోయిందనీ అది లేకుండా
ఉండలేమనీ మనస్ఫూర్తిగా నమ్ముతారు... అందుకే ఉండలేరు. అలాంటివారిని ఆ వ్యసనం
నుంచి విముక్తుల్ని చేయాలంటే వైద్యులు ముందుగా అడిగేది అలవాటు మానుకోవడానికి
సదరు బాధితులు సిద్ధంగా ఉన్నారా అని. అలా వాళ్లు దాన్ని మానుకోవడానికి అంగీకరించి
అందుకు మానసికంగా సిద్ధంగా ఉంటేనే దానికి కట్టుబడి ఉండేలా మందులు
తోడ్పడతాయి. అంతేకానీ, మనసులో నయమవ్వాలన్న కోరిక లేకపోతే కేవలం
మందులతో ఏ చికిత్సా నయం చేయలేదు.
మాటే మంత్రం
ఎవరైనా మనల్ని 'ఎలా ఉన్నారూ' అని అడిగితే... 'బాగున్నాను' అనే చెబుతాం.
మర్యాదగా అడిగినందుకు సమస్యలన్నీ ఏకరువు పెడతామా ఏంటి అనుకుంటాం
కానీ నిజానికి అలా పాజిటివ్‌గా సమాధానం చెప్పడం ద్వారా తెలియకుండానే మనకి
మనం మేలు చేసుకుంటున్నాం. బాగున్నాను... అన్నమాట మనలోని ప్రతికణమూ
వింటుంది. దాన్ని మన ఆజ్ఞగా, అభిమతంగా...భావించి బాగుండేలా చూసుకుంటుంది.
No comments:
Post a Comment