మనిషి ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు నాలుగు.
1. ఎండార్ఫిన్స్.. Endorphins,
2. డోపామిన్.. Dopamine,
3. సెరిటోనిన్.. Serotonin,
4. ఆక్సిటోసిన్.. Oxytocin.
Endorphins: మనం ఏదైనా వ్యాయామం చేసినపుడు ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఈ
Endorphins మన శరీరం లో వ్యాయామం వలన కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి
Dopamine: నిత్య జీవితం లో ఎన్నో చిన్న పెద్ద పనులు చేస్తూ ఉంటాము. ఇవి వివిధ స్థాయిలలో
మనలో Dopamine హార్మోను ను విడుదల చేస్తాయి. దీని స్థాయిని పెంచుకోవడం వలన మనం
ఆనందం గా ఉంటాము.
Serotonin: ఇతరులకు సహాయం చేసినపుడు, వారికి మేలు చేసినపుడు ఈ సెరిటోనిన్ విడుదల
అవుతుంది. మనం స్నేహితులకు , సమాజానికి మేలు చేకూర్చే ఏదైనా మంచి పని చేసినపుడు
మనలో ఈ Serotonin ఎక్కవగా విడుదల అవుతుంది.
Oxytocin: ఇది నిత్య జీవితంలో ఎదుటి మనిషిని దగ్గరికి తీసుకొని హత్తుకున్నప్పుడు బాగా
విడుదల అయ్యే హార్మోను. పిల్లలను, సమస్యలో ఉన్న వారిని భార్య లేదా భర్తను మనం దగ్గరకు
తీసుకునేటప్పుడు మనలో విడుదల అయ్యే హార్మోను. ఎదుటివారిని దగ్గరికి తీసుకున్నప్పుడు
లేదా ఆ లింగం చేసుకున్నప్పుడు ఎదుటివారిలో కూడా విడుదల అవుతుంది.
ఈ హార్మోనులు ఎక్కువ విడుదల అయ్యే వ్యక్తి ఎటువంటి అనారోగ్యాలకు లోనవడు.
అలాగే ఎక్కువ కాలం ఆరోగ్యం గా జీవిస్తారు. ఈ హార్మోన్ల యొక్క లోపం వలన అనేక
రకాలైనటువంటి అనారోగ్యాల బారిన మనం తరచూ పడుతుంటాము.
No comments:
Post a Comment