పాజిటివ్ మాట్లాడండి... ప్రతి అణువూ వింటుంది!
(6 వ భాగము) ఈనాడు సౌజన్యం తో
శరీరం పట్ల మన ధోరణినీ మార్చుకోవాలంటారు నిపుణులు. ఎవరికి వారు
'నేను బలహీనంగా ఉన్నాను' అనుకుంటే... అలాగే ఉంటారట. అలసిపోయాను
అనుకుంటే అణువణువూ ఆ అలసటని ప్రతిబింబిస్తుంది. అలాకాకుండా ఈరోజు
చాలా పని చేశాను, శరీరం నాకు సహకరించింది. ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకుంటే
సరిపోతుంది... అని చెప్పుకోండి. అలసట హుష్‌కాకి అవుతుంది. కణాలన్నీ ఉత్తేజాన్ని
నింపుకుంటాయి. ఏ పరిస్థితిని అయినా మనం చూసే ధోరణి మారాలి. శరీరంలోని అన్ని
భాగాల్లో ఉన్న కణాలనూ నియంత్రించే శక్తి మెదడుకు ఉంది. అది చెప్పినట్లే
అన్నీ సమన్వయంతో పనిచేస్తాయి. ఆ మెదడుని మనం సానుకూల దృక్పథంతో
ప్రోగ్రామ్ చేయాలి... అని సూచిస్తున్నారు పరిశోధకులు.
కణాలన్నీ నిరంతరం మెదడు నుంచి సూచనలు అందుకుంటూ, మిగతా భాగాలకు
పంపుతూ ఉంటాయి కదా. ఆ క్రమంలో ఏదైనా ఒక్క కణం గాడి తప్పి సరైన
సమయానికి సూచనలు పంపకపోతే..? పంపాల్సిన కణాలకి కాకుండా వేరే వాటికి పంపితే..?
ఒకవేళ తనకి వచ్చిన సూచనలకు తగినట్లుగా ఏదైనా కణం స్పందించకపోతే..?
అసలే సూచనా అందకుండానే ఒక కణం అతిగా స్పందిస్తే..? ఇలాంటి ఒక్కో పొరపాటు
ఒక రోగానికి కారణం కావచ్చు. ఉదాహరణకి ఒకటి చూద్దాం.
మనం తినే ఆహారం చక్కెర(గ్లూకోజు)గా మారి రక్తంలో కలుస్తుంది. సాధారణంగా
క్లోమగ్రంథిలోని కణాలు రక్తం ద్వారా ఇన్సులిన్ రూపంలో ఒక సిగ్నల్ పంపుతాయి.
కాలేయం, కండరాలూ ఇతర కొవ్వుకణాలకు ఈ చక్కెరను భవిష్యత్ ఉపయోగానికి
దాచుకోమని చెప్పే సూచన అది. క్లోమగ్రంథిలోని కణాలు ఆ సిగ్నల్ పంపకపోతే...
ఇన్సులిన్ అందాల్సిన వాటికి అందదు. అవి చక్కెరను గ్రహించవు. దాంతో రక్తంలో
చక్కెర ఎక్కువగా ఉండిపోతుంది. అదే మధుమేహానికి దారితీస్తుంది.
No comments:
Post a Comment