సప్లిమెంట్లు తీసుకోవడానికి ఉత్తమ సమయం


ఈ మధ్యకాలంలో సప్లిమెంట్స్ తప్పనిసరి అవుతున్నాయి అయితే ఈ సప్లిమెంట్స్ ఎప్పుడు 

తీసుకోవాలో తెలిసి ఉండాలి. సప్లిమెంట్స్ ని తీసుకోవాల్సిన సమయం ను బట్టి అవి మన 

శరీరంలో సోషించుకునేటువంటి అవకాశం ఉంటుంది.


1. మ్యాగ్నీషియం (Magnesium)  

👉 నిద్రకు 1 గంట ముందు


2. విటమిన్ D (Vitamin D)  

👉 అల్పాహారం (Breakfast) సమయంలో


3. కాల్షియం (Calcium)  

👉 ఉదయం మరియు రాత్రి


4. ప్రోబయోటిక్స్ (Probiotics)  

👉 ఖాళీ కడుపుతో


5. ఒమేగా-3 (Omega-3)  

👉 భోజనంతో పాటు


6. విటమిన్ B కాంప్లెక్స్ (Vitamin B Complex)  

👉 ఉదయం


7. విటమిన్ E (Vitamin E)  

👉 భోజనం తర్వాత


8. కొల్లాజెన్ (Collagen)  

👉 అవసరాన్ని బట్టి (సమయం వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది)


9. ఐరన్ (Iron)  

👉 విటమిన్ C ఉన్న పదార్థాలతో (ఉదా: నారింజ రసం)


10. జింక్ (Zinc)  

👉 ఐరన్ తీసుకున్న సమయం నుంచి కనీసం 2 గంటల విరామం ఉంచాలి


---

⚠️ గమనిక: ఇవి సాధారణ సూచనలు మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితి, వయస్సు, మందులు

మరియు వైద్యుని సలహా ప్రకారం సమయాలు మారవచ్చు.





👉 Join WhatsApp Group

 రోజుకు 8 గంటల నిద్ర ఎందుకు ముఖ్యం?


నిద్ర = మెదడుకు ఛార్జింగ్

ఆరోగ్యానికి రోజుకు 8 గంటల నిద్ర ఖచ్చితంగా అవసరం. వరుసగా 10 రోజుల పాటు రోజుకు 6

గంటలు మాత్రమే నిద్రపోతే, మన శారీరక, మానసిక పనితీరు (Cognitive & Physical performance) 

50% వరకు తగ్గిపోతుంది.

తక్కువ నిద్ర వల్ల వచ్చే సమస్యలు:

1. మెదడు మందగిస్తుంది: ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది.

2. ఒత్తిడి పెరుగుతుంది: కార్టిసాల్ హార్మోన్ పెరిగి ఆందోళన, చిరాకు ఎక్కువవుతాయి.

3. రోగనిరోధక శక్తి తగ్గుతుంది: తరచుగా జలుబు, ఇన్ఫెక్షన్లు వస్తాయి.

4. బరువు పెరుగుతుంది: ఆకలి హార్మోన్లు గ్రెలిన్, లెప్టిన్ బ్యాలెన్స్ తప్పుతాయి.

5. గుండె, షుగర్ రిస్క్: డయాబెటిస్, బీపీ, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది.

మెదడు ఒత్తిడిని ఎదుర్కోవాలంటే 4 స్తంభాలు:

శరీరం సరిగ్గా హైడ్రేట్ అయి, తగినంత నిద్ర, పోషకాహారం మరియు వ్యాయామం ఉన్నప్పుడు

మెదడు ఎలాంటి ఒత్తిడినైనా సులభంగా ఎదుర్కొంటుంది.

1. నీరు (Hydration): రోజుకు 2.5-3 లీటర్ల నీరు తాగండి. మెదడు 75% నీరే.

2. నిద్ర (Sleep): రాత్రి 10 నుండి ఉదయం 6 మధ్య 8 గంటలు నిద్రపోండి. ఇది గ్రోత్ హార్మోన్,
     
    మెమరీ కన్సాలిడేషన్‌కి బెస్ట్ టైమ్.

3. పోషకాహారం (Nutrition): బాదం, వాల్‌నట్స్, ఆకుకూరలు, గుడ్లు, చేపలు. ఇవి ఒమేగా-3, విటమిన్

    B12 ఇచ్చి నరాలను బలపరుస్తాయి.

4. వ్యాయామం (Exercise): రోజూ 30 నిమిషాల నడక లేదా యోగా. ఇది బ్రెయిన్‌కి ఆక్సిజన్, 
    
    ఎండార్ఫిన్లు అందిస్తుంది.

గుర్తుంచుకోండి: నిద్రను తగ్గించి పని చేయడం = ఫోన్‌ని 20% ఛార్జింగ్‌తో రోజంతా వాడటం
                    
                               లాంటిది.





👉 Join WhatsApp Group

 నరాల బలహీనత (Neuropathy) - నిశ్శబ్ద మహమ్మారి


ఈ రోజుల్లో నరాల బలహీనత సమస్యతో ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య గణనీయంగా

పెరుగుతోంది. దీనిని " ముంచుకొస్తున్న ముప్పు" అనడం కంటే, మన ఆధునిక జీవనశైలి వల్ల

ఏర్పడిన "నిశ్శబ్ద మహమ్మారి (Silent Epidemic)" గా చెప్పడం మరింత సబబు.

గతంలో వృద్ధాప్యంలో మాత్రమే కనిపించే ఈ సమస్య, ఇప్పుడు 30-40 ఏళ్ల యువతలో కూడా

విపరీతంగా కనిపిస్తోంది.

నరాల బలహీనత పెరగడానికి ప్రధాన కారణాలు:


1. మధుమేహం (Diabetic Neuropathy)  


భారతదేశంలో డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. రక్తంలో చక్కెర 

స్థాయిలు అదుపులో లేకపోవడం వల్ల నరాలు దెబ్బతింటాయి. నరాల బలహీనతకు ఇది అతిపెద్ద 

కారణం.

2. విటమిన్ B12 లోపం  


మన నరాల ఆరోగ్యానికి విటమిన్ B12 చాలా కీలకం. ఈ రోజుల్లో మనం తీసుకునే ప్రాసెస్

చేయబడిన ఆహారాలు, మరియు శాకాహారుల్లో ఈ విటమిన్ లోపం చాలా ఎక్కువగా కనిపిస్తోంది.

3. కదలిక లేని జీవనశైలి (Sedentary Lifestyle)  


గంటల తరబడి కదలకుండా కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల వెన్నెముకపై, నరాలపై 

ఒత్తిడి పెరిగి రక్త ప్రసరణ మందగిస్తోంది.

4. విపరీతమైన ఒత్తిడి, నిద్రలేమి  


మెదడుకు, నరాలకు తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల నాడీ వ్యవస్థ (Nervous System) క్రమంగా 

బలహీనపడుతుంది.

5. పోస్ట్-కోవిడ్ ప్రభావాలు  


కరోనా తర్వాత చాలా మందిలో నాడీ సంబంధిత సమస్యలు, కండరాల నొప్పులు, మరియు 

నరాల బలహీనత తలెత్తుతున్నట్లు వైద్యులు గమనిస్తున్నారు.

ఇది ముంచుకొస్తున్న ముప్పా?


సకాలంలో గుర్తించి జాగ్రత్తపడితే ఇది ప్రాణాంతకమైన ముప్పు కాదు. కానీ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం

ఖచ్చితంగా ప్రమాదమే. 

ప్రారంభంలో చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మంటలు, స్పర్శ తగ్గడం వంటి లక్షణాలతో మొదలై 

రాను రాను నడవలేకపోవడం, పక్షవాతం లేదా ఇతర అవయవాలు దెబ్బతినే స్థాయికి ఇది 

దారితీయవచ్చు.

మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు


1. పోషకాహారం  

విటమిన్ B12, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని (పాలు, 

గుడ్లు, చేపలు, మొలకలు, ఆకుకూరలు) తీసుకోవాలి.

2. వ్యాయామం  

రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం లేదా యోగా చేయడం వల్ల నరాలకు రక్త ప్రసరణ 

మెరుగుపడుతుంది.

3. వైద్య పరీక్షలు  

తరచుగా తిమ్మిర్లు, నొప్పులు వస్తుంటే సొంత వైద్యం చేసుకోకుండా, డాక్టర్‌ను సంప్రదించి బ్లడ్ 

షుగర్ మరియు B12 స్థాయిలను పరీక్షించుకోవాలి







👉 Join WhatsApp Group

కీళ్ల నొప్పులు 


ఉదయం నిద్రలేవగానే కీళ్లు పట్టేసినట్లు అనిపించడం.. మెట్లు ఎక్కాలంటే మోకాళ్లలో కటకట

శబ్దాలు రావడం.. కింద కూర్చుని లేవాలంటే నరకం కనిపించడం.. 60 పదుల వయసులో 

చాలామందికి ఎదురయ్యే సమస్య ఇది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం, 60 ఏళ్లు పైబడిన వారిలో 10% పురుషులు, 18% 

మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనినే 'ఆస్టియో ఆర్థరైటిస్' (Osteoarthritis) అంటారు. 

మనం కీళ్లవాతం అని పిలుస్తాం.


అసలు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏమిటి?

మన కీళ్ల వద్ద ఎముకలు రాసుకోకుండా ఉండేందుకు వాటి చివరన రబ్బరు లాంటి మెత్తటి పొర 

ఉంటుంది. దీనిని కార్టిలేజ్ (Cartilage) అంటారు. ఇది 'షాక్ అబ్జార్బర్' లా పనిచేస్తుంది.

వయసుతో ఈ కార్టిలేజ్ అరిగిపోతుంది. అప్పుడు ఎముకలు నేరుగా రాసుకోవడం వల్ల నొప్పి, వాపు 

వస్తాయి. ఇది ఎక్కువగా మోకాళ్లు, తుంటి, చేతులు, వెన్నెముకపై ప్రభావం చూపుతుంది.

ఈ సమస్య ఎందుకు వస్తుంది?

1. అధిక బరువు: బరువు ఎక్కువైతే ఆ భారం అంతా మోకాళ్లపైనే పడి అవి త్వరగా అరిగిపోతాయి.

2. పాత గాయాలు: యవ్వనంలో తగిలిన గాయాలు, ఫ్రాక్చర్లు వయసుతో కీళ్లవాతంగా మారవచ్చు.

3. వంశపారంపర్యం: కుటుంబంలో ఈ సమస్య ఉంటే మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ.

4. వృత్తిపరమైన ఒత్తిడి: ఒకే కీలును పదే పదే కదిలించడం, నిలబడి చేసే పనుల వల్ల కీళ్లపై             

    ఒత్తిడి పడుతుంది.


ముందస్తు హెచ్చరికలు

- పనులు చేస్తున్నప్పుడు కీళ్లలో భరించలేని నొప్పి

- ఉదయం నిద్ర లేవగానే కీళ్లు బిగుసుకుపోయి కదలడానికి ఇబ్బంది

- కీళ్లను కదిలిస్తే లోపల కటకట మనే శబ్దాలు

- నొప్పి ఉన్న కీళ్ల చుట్టూ వాపు, కీళ్లను ఫ్రీగా కదపలేకపోవడం


ఆస్టియో ఆర్థరైటిస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలివే!


కంగారు వద్దు.. ఈ చిట్కాలతో ఉపశమనమే!


1. కదలికే ఔషధం: నొప్పి ఉందని కదలకుండా ఉండొద్దు. వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ చేయాలి. 

                                    ఇవి కీళ్ల చుట్టూ ఉండే కండరాలను బలోపేతం చేస్తాయి.

2. బరువు తగ్గడం: కేవలం 5 కిలోల బరువు తగ్గినా, మోకాళ్లపై పడే 20 కిలోల ఒత్తిడి తగ్గినట్లే!

3. కీళ్ల రక్షణ: మోకాలికి క్యాప్ (Knee Brace) వాడటం, అవసరమైతే వాకింగ్ స్టిక్ వాడండి. ఇది 

                        సపోర్ట్.

4. విశ్రాంతి ముఖ్యం: మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకోండి. ఒత్తిడి తగ్గించేందుకు ధ్యానం చేయండి.


ఆహారమే ఆరోగ్యం

మీ ఆహారం కీళ్లలోని వాపును (Inflammation) తగ్గించేలా ఉండాలి.


ఏం తినాలంటే:

- ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: చేపలు, వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్. ఇవి కీళ్లకు గ్రీజులా 

  పనిచేస్తాయి.

- విటమిన్ సి పండ్లు: నారింజ, బత్తాయి, బెర్రీలు, చెర్రీ పండ్లు వాపును తగ్గిస్తాయి.

- కాల్షియం బూస్టర్స్: తక్కువ కొవ్వు పాలు, పెరుగు, ఆకుకూరలు (పాలకూర, బ్రోకోలీ).


ఏం తినకూడదు:

- ప్రాసెస్డ్ ఫుడ్స్: జంక్ ఫుడ్స్, డీప్ ఫ్రై పదార్థాలు.

- చక్కెర, స్వీట్లు: కూల్ డ్రింక్స్, మిఠాయిలు నొప్పులను పెంచుతాయి.

- రిఫైన్డ్ కార్బ్స్: మైదా బ్రెడ్, పేస్ట్రీలు, మితిమీరిన ఉప్పు, మద్యపానం.


వయసు పెరగడం సహజం. కీళ్ల నొప్పులు వచ్చాయని జీవితాన్ని గదికి పరిమితం చేయొద్దు. సరైన

ఆహారం, తగినంత వ్యాయామం, డాక్టర్ సలహాతో ఈ కీళ్లవాతాన్ని జయించి ఆనందంగా 

ముందడుగు వేయండి!




👉 Join WhatsApp Group