30 రకాల కూరగాయలు – ఒక్కోదాని వల్ల ఒక్కో ఉపయోగం – ఇది తెలుసుకుంటే చాలు


అల్లం:  అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

కరివేపాకు: కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

నేరేడు పండ్లు:  నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

గుమ్మడికాయ: గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

అవకాడో ఫలాలు: అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.

జామపళ్ళు: జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.

బ్లాక్ టీ: బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.

సజ్జలు: సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.

మామిడి పండ్లు: మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.

బీట్ రూట్: బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది.

మునగాకు: మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

దానిమ్మ: దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.

ఆవాలు: ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది.

అల్లం: అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.

కీరదోస: కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.

మునగాకు: మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.

ద్రాక్ష: ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.

బీట్ రూట్: బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.

క్యారెట్: క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

మొక్కజొన్న: మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.

ఉల్లిపాయ: ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.

అనాస పండ్లు: అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.

పుచ్చకాయపుచ్చకాయలో ఉండే లైకోపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.

సపోటాపళ్ళు: సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.

దాల్చిన చెక్క: దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.

ఆవాలు: ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.

చేపలు: చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

కమలాఫలాలు: కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.

క్యారెట్లు: క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.

యాపిల్: యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

వాము: వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

పచ్చి జామకాయ: పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.

ఉలవలు: ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి.

ఖర్జూరం: ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.

ద్రాక్ష: ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరిచేరనివ్వవు.

జామపళ్ళు: జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

టొమాటో: ప్రోస్ట్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.

నేరేడు పళ్ళు: నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

బొప్పాయి: మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.

మునగ కాయలు: మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.


జొన్న ఇడ్లీలు


జొన్నలు లేదా జొన్నరవ్వ  మూడు కప్పులు తీసుకోవచ్చు. ఒక కప్పు మినప్పప్పు,

అరస్పూన్ మెంతులు వీటన్నిటిని కలిపి ఆరు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత

వీటన్నిటిని గ్రైండ్ చేసుకొని కనీసం 6 గంటల తర్వాత ఇడ్లీగా పెట్టుకున్నట్లైతే పిండి కాస్త

పులిసి ఇడ్లీలు వస్తాయి. కాస్త సోడా ఉప్పు కలిపితే ఇడ్లీలు మృదువుగా వస్తాయి. 

రోజూ ఇడ్లీలు దోశలు తినే వారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం.

ఇలాంటి చిరు ధాన్యాలతో  వంటకాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకొనుటకు

ఈ క్రింద ఉన్న లింకు క్లిక్ చేయుట ద్వారా బుక్ డౌన్లోడ్ చేసుకోండి. 

మునగాకు పచ్చడి


మన చుట్టూ ఉన్న ఆకులు, కాయల్లోనే ఎన్నో మొండి వ్యాధులను నయం చేయగలిగిన లక్షణాలు

ఉన్నాయి. అంతేకాదు వాటిని మనం వంటల్లో భాగం చేసుకోవడం వల్ల కొన్ని వ్యాధులు ముప్పు

కూడా తప్పిపోతుంది. అన్ని కాలాల్లో దొరికే  మునగాకును ఆహారంలో భాగంగా చేసుకుంటే మనం

తరచూ ఎదుర్కొనే చిన్న చిన్న వ్యాధులను కాపాడుతుంది. ఇందులో విటమిన్-ఎ, క్యాల్షియం

అధికంగా ఉండడం వల్ల  వ్యాధులు రాకుండా చేస్తుంది. బరువు, లావు తగ్గాలనుకునే వారికి

మునగాకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్-సి ఎముకలను బాగా బరపరుస్తుంది.

విటమిన్-ఎ,సి నే కాకుండా కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీ

బాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకులను పచ్చడి లేదా కూరచేసుకుని తింటే

జీర్ణ శక్తిని పెంచుతుంది. అలాగే మధుమేహం, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. 

ఇన్ని ఔషధ గుణాలున్న మునగాకు పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం.


ఒక పాన్ లో కొంచెం నూనె పోసి వేడిగా అయిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర,

ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు, వెల్లుల్లి, ధనియాలు, పచ్చిమిర్చి , ఇవన్నీ బాగా వేయించి

తీసి ఒక బౌల్‌లో పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత రెండు కప్పుల మునగాకుకు అదే పాన్ లో

కొంచెం నూనె వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి పక్కనే పెట్టుకోవాలి. మిక్సీ జారులో

ముందు వేయించిన దినుసలన్నీ వేసి ,నానబెట్టిన చింతపండు మిక్సీ పట్టి ఆ తరువాత 

మునగాకు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పచ్చడిని గిన్నెలోకి తీసుకుని

పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్ లో కొంచెం నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర,

కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాళింపు పెట్టి రుబ్బుకున్న పచ్చడి అందులో వేసి కలిపి

దించేయాలి. ఇలా చేసిన పచ్చడిని తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

 కరివేపాకు సూప్ 

(కరివేపాకు తో వెయిట్ లాస్ మరియు సంపూర్ణ ఆరోగ్యం పొందే ఒక రిసీపీ)

కరివేపాకులో పలు రకాల ఔషధ గుణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున ఇది

'ఆయుర్వేద నిధి'  గా పరిగణించబడుతుంది.


కరివేపాకు సూప్ తయారుచేసుకోవడం చాలా సులువు. ఒక పాన్‌లో ఒక కప్పు నీటిని మరిగించాలి.

గ్యాస్ ఆఫ్ చేసి, ఆ నీటిలో కరివేపాకు ఆకులను వేయాలి. కాసింత మిరియాలు, దాల్చిన చెక్క,

లవంగం వేసి, ఆ సూప్ కలర్ మారే వరకు ఉంచి, ఆపై కరివేపాకు ఆకులను తీసేయాలి.

అనంతరం ఆ సూప్ తాగాలి. 

కరివేపాకు సూప్ వల్ల కలిగే ప్రయోజనాలు  ఏంటో చూద్దాం.

బరువు తగ్గడానికి: 

కరివేపాకు సూప్ బరువు తగ్గించే పానీయంగా ఉపయోగించవచ్చు. దీని వినియోగం ఊబకాయాన్ని

తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్‌ను త్వరగా తగ్గించడంలో సహాయపడుతుంది. వాడిన ఒక వారం 

రోజుల నుంచే తేడా గమనించవచ్చు.


మెరుగైన జీర్ణక్రియ: 

జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా కరివేపాకు, కరివేపాకు సూప్ను

తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో లాక్సిటివ్‌లు ఉంటాయి. దీని వల్ల గ్యాస్, మలబద్ధకం,

విరేచనాలు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.


శరీర నిర్విషీకరణ 

కరివేపాకు నీటిని తాగడం వల్ల శరీరం నుంచి విష మలిణా లు తొలగిపోతాయి. వాస్తవానికి ఈ

ఆకులలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు శరీర నిర్విషీకరణకు సహాయపడతాయి. చర్మ ఇన్ఫెక్షన్లు,

చర్మ సమస్యలు మరియు ఫ్రీ రాడికల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.


మానసిక ఒత్తిడి దూరం: 

ప్రస్తుత కాలంలో చాలా మంది మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పనిభారం, డబ్బు,

అనారోగ్యం మొదలైన కారణాలతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కరివేపాకు సూప్ తాగితే

టెన్షన్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది.


గమనిక: 

కరివేపాకు కాషాయమే తీసుకోవాలని ఏం లేదు, ఒక పిటికెడు కరివేపాకును ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్

పాటు తీసుకోవడం ద్వారా పైన చెప్పిన లాభాలు అన్నీ కూడా కలుగుతాయి. అయితే బాగా నమిలి

తినాలి.


పాజిటివ్ మాట్లాడండి... ప్రతి అణువూ వింటుంది! 

(1 వ భాగము) ఈనాడు సౌజన్యం తో 

ఒక రాజ్యంలోని ప్రజల మంచీచెడూ చూసుకోవాల్సిన బాధ్యత దాన్ని పాలించే రాజుదే కదా. 

ఆ ప్రజల సంక్షేమం గురించి రాజు ఎంత బాగా పట్టించుకుంటే వాళ్లూ అంత బాగా తమ 

కర్తవ్యాల్నినిర్వర్తిస్తారు. రాజ్యం ప్రశాంతంగా ఉంటుంది. మీ శరీరాన్నే ఒక రాజ్యం

అనుకుంటే దానికి రాజు మీరే. శరీరంలోని కణాలన్నీ మీ ప్రజలు. రాజుగా మీ బాధ్యత 

ఆ కణాల బాగోగులు చూడడం అప్పుడే అవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

మరి వాటి గురించి మీరు పట్టించుకుంటున్నారా..?


ఆమె నవ్వితే మొహమంతా నవ్వినట్లుంటుంది. 

అతనికి అణువణువునా పొగరే...

వాడికి ఆ స్వభావం నరనరానా జీర్ణించుకుపోయింది...

ఇలాంటి మాటలు తరచూ వింటూనే ఉంటాం. 

నవ్వితే పెదవులు కదుల్తాయి కానీ ముఖమంతా

ఎందుకు నవ్వుతుంది...?

పొగరైనా స్వభావమైనా మాటతీరులో పనితనంలో కన్పిస్తుంది కానీ ఒంట్లో ఎలా కన్పిస్తుంది?

ఎందుకూ అంటే ఆయా భావాలకు వారిలోని అణువణువూ స్పందించడం వల్ల కన్పిస్తుంది.

శరీరం ఎప్పుడు స్పందిస్తుందలా? మనస్ఫూర్తిగా ఆ భావాన్ని ఆవహించుకున్నప్పుడు...!

మనసారా నవ్వితే... ముఖంలోని ప్రతి కణం ఉత్తేజితమవుతుంది. ఏ భావమైనా అంతే. 

అందుకే ఇలాంటి మాటలు వాడుకలోకి వచ్చాయి.



 పాజిటివ్ మాట్లాడండి... ప్రతి అణువూ వింటుంది! 

(2 వ భాగము)  ఈనాడు సౌజన్యం తో 

'మనం' అంటే మన మనసూ ఆలోచనలూ మాత్రమే కాదు, మన శరీరమూ, అందులోని 

భాగాలూ, బయటికి కన్పించేవీ, లోపల ఉన్నవీ... అన్నీ కలిస్తేనే 'మనం'.


పైకి కన్పించే శరీరాన్ని రోజూ చూసుకుంటూనే ఉంటాం కానీ, లోపలి శరీరం గురించి ఎప్పుడన్నా

ఆలోచించారా? ఏముంటుందీ... రక్తమాంసాల ముద్దలేగా అనుకుంటాం. కానే కాదు,

అదో అద్భుతం. కొన్ని లక్షల కోట్ల కణాలు కలిసి ఏర్పడిన ఈ శరీరంలో ఒక్కో కణం ఒక్కో చిన్న 

ఫ్యాక్టరీలాగా పనిచేస్తుంది. ప్రతి కణమూ శరీరానికి కావలసిన ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది, 

శక్తినిచ్చే ఇంధనాన్ని తయారు చేసుకుంటుంది, సంక్లిష్టమైన కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ని కలిగి 

ఉంటుంది. ప్రతి కణమూ దేనికదే స్వతంత్ర యూనిట్‌ అయినప్పటికీ కణాలన్నీ సమష్టిగా 

పనిచేస్తాయి. మెదడు చెప్పేది వింటాయి. దానికి స్పందిస్తాయి. తమలో తాము 

మాట్లాడుకుంటాయి. దూరంగా ఉన్నవాటికి సైగలు చేస్తాయి. సంకేతాలు పంపుతాయి. అలాగని 

అవేమీ స్థిరంగా ఉండవు. నిరంతరం విభజనకు లోనవుతూ ఉంటాయి. కొన్నిటి జీవితకాలం 

కేవలం కొన్ని గంటలే. మరికొన్ని నాలుగు నెలల దాకా జీవించి ఉంటాయి. మన శరీరంలో 80 

విభిన్న అవయవాలుంటే, 200 రకాల కణాలుంటాయి. సగటు మనిషి శరీరంలో 87.2 

ట్రిలియన్ల కణజాలాలుండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. 

కణాల పనితీరు గురించి ఎప్పటికప్పుడు మరింత లోతుగా అధ్యయనం చేయడం

ద్వారా శాస్త్రవేత్తలు రకరకాల జబ్బులకు కారణాల్నీ చికిత్సల్నీ కనుక్కుంటుంటే,

మరోపక్క మానసిక శాస్త్రవేత్తలేమో వాటికి సరైన సూచనలివ్వడం ద్వారా కొన్ని

సమస్యల్ని రాకుండానే నివారించవచ్చంటున్నారు.


పాజిటివ్ మాట్లాడండి... ప్రతి అణువూ వింటుంది! 

(3 వ భాగము) ఈనాడు సౌజన్యం తో 

జీవితకాలం ఇవి ఏమేం పనులు చేయాలీ అన్నదాన్ని కణంలో ఉండే న్యూక్లియస్‌ నిర్దేశిస్తుంది.

అంటే ప్రతి కణానికీ దాని పనికి సంబంధించి ఒక రూల్‌ బుక్‌ ఉంటుందన్నమాట.

దాన్నే "హ్యూమన్‌ జీనోమ్‌' అంటున్నాం. అయితే పుట్టుకతో వచ్చిన ఈ జీనోమ్‌ని

జీవితాంతం భరించనక్కరలేదనీ, కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ లాగే దీన్నీ తిరగరాసుకోవచ్చనీ 

అంటున్నారు శాస్త్రవేత్తలు.


గర్భంలోని శిశువు తల్లి ఆలోచనలకు స్పందించడం మనకు తెలుసు. పసిపిల్లలుగా

ఉన్నప్పుడు తల్లి కన్పించకపోతే భయం, ఎవరైనా ఎత్తుకుంటే పడేస్తారేమోనని భయం... 

అలా ప్రాణభయంతో మొదలై వయసుతో పాటు మారుతూ పెద్దయ్యేసరికి డీఫాల్ట్‌గా 

ఒత్తిడి రూపంలో మన శరీరమనే కంప్యూటర్‌లో ప్రోగ్రామ్‌ అయిపోతోంది.

అవుట్‌ డేట్‌ అయిపోయిన ఈ సాఫ్ట్‌వేర్‌ని మనం పాజిటివ్‌ థింకింగ్‌ అనే సాఫ్ట్‌వేర్‌తో

రీప్రోగ్రామ్‌ చేయకపోతే మన భావాలకీ ఆలోచనలకీ మనమే బాధితులుగా మిగిలిపోతాం

అంటున్నారు పరిశోధకులు. జీన్‌ ఎడిటింగ్‌ లాంటి ప్రక్రియలతో అటు వాళ్లూ

మెదడుకిచ్చే సూచనలతో ఇటు మనస్తత్వ శాస్త్రవేత్తలూ ప్రయోగాలు చేస్తున్నారు.

మన శరీరంలోని కోట్లాది కళాలూ మన మాట వింటాయి. మన ఆజ్ఞ కోసం

ఎదురుచూస్తుంటాయి. మనం చేయాల్సిందల్లా కెప్టెన్‌లాగా ఆజ్ఞలు ఇవ్వడమే.

అణురూపంలోని ఈ సేవకులన్నీ దాన్ని ఉత్సాహంగా ఆచరణలో పెడతాయి.

అది నోటి మాటగానే చెప్పనక్కరలేదు. మనసులో ఆలోచనగా ఉన్నా చాలు,

నాడీవ్యవస్థ ద్వారా మొత్తం శరీరంలోని కణాలన్నిటినీ చేరుతుంది... 

అని చెబుతున్నారు ఈ పరిశోధకులు. కానీ మనమేం చేస్తున్నాం..?

మీరు ఒక జలాంతర్గామికి కమాండర్‌గా ఉన్నారనుకుందాం. పెరిస్కోప్‌ లోనుంచి చూస్తే

ఎదురుగా పెద్ద మంచుకొండలు, రెండుపక్కలా పొంచి ఉన్న శత్రుసైన్యం,

వెనకాల ఏముందో తెలియకుండా దట్టంగా మంచు... కనపడతాయి.

ఇదే నివేదికని మీరు లోపలున్న వాళ్లకి పంపిస్తారు. వాళ్లు బయటికి చూడలేరు

కాబట్టి మీరు చెప్పిందే నమ్ముతారు. అన్నిపక్కలా సమస్యలే ఉన్నప్పుడు

చేయగలిగిందేముంది అనుకుని నిరాశతో ప్రయత్నమే చేయకుండా

శత్రువుకి లొంగిపోతారు. అచ్చం ఆ సబ్‌మెరైన్‌ కమాండర్‌ పంపినట్లు

నెగెటివ్‌ రిపోర్టు నిత్యం మనం కణాలకు పంపుతున్నాం. వాటిని నిర్వీర్యం చేస్తున్నాం.


తెల్లారి లేస్తే మనకెన్నో ఫిర్యాదులు. ఆరోగ్యమూ, ఆర్థిక విషయాలూ, పిల్లలూ,

పెద్దలూ, ఉద్యోగమూ, వ్యాపారమూ... ఏదో ఒక ఫిర్యాదుతోనే రోజు మొదలవుతుంది.

మాటల్లో వద్దు, కాదు, కూడదు... లాంటి పదాలూ నెగెటివ్‌ వాక్యాలే ఎక్కువగా ఉంటాయి.


 పాజిటివ్ మాట్లాడండి... ప్రతి అణువూ వింటుంది! 

(4 వ భాగము) ఈనాడు సౌజన్యం తో

కొందరు ఆరోగ్యం గురించి రకరకాలుగా తమకు తామే ఊహించుకుని పెద్ద పెద్ద

రోగాల పేర్లు చెబుతూంటారు. అలాంటి మాటల్ని ఎన్నోసార్లు విన్న కణాలకు 

అది సజెషన్‌ లాగా అనిపిస్తుంది. దాన్ని వారి కోరికగా భావించి అమలు చేసేస్తాయి.


అలా కాకుండా 'నాకేం దిట్టంగా ఉన్నాను. దేన్నయినా జీర్ణించుకోగలను' అన్నారనుకోండి,

అప్పుడు పొట్టలోని కణాలు కూడా అలాగే పనిచేయడానికి ప్రయత్నిస్తాయి.

మనమేమో ఏదైనా సమస్య ఉంటేనే దాని గురించి మాట్లాడతాం కానీ, అంతా బాగుంటే

అసలు శరీరం గురించి పట్టించుకోం.


వ్యసనపరులను చూస్తూనే ఉంటాం కదా. అలవాటైపోయిందనీ అది లేకుండా

ఉండలేమనీ మనస్ఫూర్తిగా నమ్ముతారు... అందుకే ఉండలేరు. అలాంటివారిని ఆ వ్యసనం

నుంచి విముక్తుల్ని చేయాలంటే వైద్యులు ముందుగా అడిగేది అలవాటు మానుకోవడానికి

సదరు బాధితులు సిద్ధంగా ఉన్నారా అని. అలా వాళ్లు దాన్ని మానుకోవడానికి అంగీకరించి

అందుకు మానసికంగా సిద్ధంగా ఉంటేనే దానికి కట్టుబడి ఉండేలా మందులు

తోడ్పడతాయి. అంతేకానీ, మనసులో నయమవ్వాలన్న కోరిక లేకపోతే కేవలం

మందులతో ఏ చికిత్సా నయం చేయలేదు.


 మాటే మంత్రం


ఎవరైనా మనల్ని 'ఎలా ఉన్నారూ' అని అడిగితే... 'బాగున్నాను' అనే చెబుతాం.

మర్యాదగా అడిగినందుకు సమస్యలన్నీ ఏకరువు పెడతామా ఏంటి అనుకుంటాం

కానీ నిజానికి అలా పాజిటివ్‌గా సమాధానం చెప్పడం ద్వారా తెలియకుండానే మనకి

మనం మేలు చేసుకుంటున్నాం. బాగున్నాను... అన్నమాట మనలోని ప్రతికణమూ

వింటుంది. దాన్ని మన ఆజ్ఞగా, అభిమతంగా...భావించి బాగుండేలా చూసుకుంటుంది.


అలా కాకుండా "తల పగిలిపోతోంది. ట్యాబ్లెట్‌ వేసుకున్నా తగ్గలేదు. ఈ వేళ పనిచేయలేను...”

అని ఒకటికి పదిసార్లు అనుకుంటే అది విన్న కణాలు నిజంగానే తలనొప్పిని భరించలేని

స్థితికి తీసుకెళ్తాయి.


ఒకసారి పాజిటివ్‌గా ఆలోచించి చూడండి... అకస్మాత్తుగా లాటరీ తగిలి లక్ష రూపాయలు

వస్తే, ఉద్యోగంలో మీ పనికి మెచ్చి జీతం పెంచితే, రాదని మర్చిపోయిన పాతబాకీ

డబ్బుల్ని తీసుకున్న వ్యక్తి భద్రంగా తెచ్చిస్తే... ఆ అనుభూతి ఎలా ఉంటుందో

ఊహించుకోండి. మాటల్లో చెప్పలేని సంతోషం కలుగుతుంది కదా. అది శరీరంలోని

ప్రతి కణానికీ పాకుతుంది. గాల్లో తేలిపోతున్న అనుభూతినిస్తుంది. మనం సంతోషంగా

ఉన్నప్పుడు కణాలూ ఉత్సాహంగా ఉంటాయి. ఆ ఉత్సాహంతో గబగబా వ్యర్థాలను

బయటకు నెట్టేస్తాయి. మొత్తం శరీరాన్ని శుభ్రం చేసేస్తాయి. గ్రంథులన్నీ ఫుల్‌

స్పీడులో పనిచేయడం మొదలెడతాయి. 48 గంటల్లో మొత్తం శరీరం నూతనోత్తేజంతో

నిండిపోతుంది. అలాంటప్పుడే జీవితంలో ఏదైనా సాధ్యమే అన్న నమ్మకం  కలుగుతుంది.

అణువణువునా సానుకూల వైఖరి ప్రతిఫలిస్తూ భవిష్యత్తుమీద ఆశను పెంచుతుంది.

కాకపోతే అలాంటి సంఘటనలు నిత్యం జరగవు కాబట్టి మనమే ప్రతి సందర్భాన్నీ

సానుకూలంగా చూడడం  అలవరచుకోవాలి.

 పాజిటివ్ మాట్లాడండి... ప్రతి అణువూ వింటుంది! 

(5 వ భాగము) ఈనాడు సౌజన్యం తో


యుద్ధరంగంలో ఉన్న సైనికులకు వాళ్ల పై అధికారి ఏమని చెబుతాడు?

శత్రుసైన్యం మనకన్నా పెద్దది, మనం ఎంత పోరాడినా వృథానే... 

అని చెప్పరు కదా? 'పదండి, ముందుకు దూకండి. మీ శక్తి ముందు శత్రుసైన్యం బలాదూర్‌. 

విజయం మనదే' లాంటి మాటలతో వాళ్లకి ప్రేరణ కలిగిస్తాడు. అవి వారి శక్తిసామర్థ్యాలను

రెట్టింపు చేస్తాయి. పిల్లలు ఒకసారి పరీక్ష తప్పితే 'నీవల్ల కాదులే, మానేసెయ్‌' అనరుగా.

'పర్వాలేదు. ఎక్కడో పొరపాటు జరిగివుంటుంది. నువ్వు బాగా చదువుతావు. 

ఈసారి తప్పకుండా పాసవుతావు' అని ప్రోత్సహిస్తారు.


నిజమే కానీ ఒకోసారి- మన పొట్టలో నొప్పి తీవ్రంగా ఉండవచ్చు, సైన్యం ఓడిపోయే

యుద్ధమే చేస్తుండవచ్చు, పిల్లవాడిలో పరీక్ష ఎదుర్కొనే సత్తా లేకపోవచ్చు. 

అటువంటప్పుడు అబద్ధమెలా చెబుతాము... అనిపిస్తుంది. అక్కడే ఉంది అసలు

విషయమంతా. చెవిటి కప్ప కథ గుర్తుందా?


బావిలోనుంచి బయటకు రావడానికి ప్రయత్నించి కొన్ని కప్పలు చతికిలబడతాయి.

అవి ఊరుకోకుండా మిగతా వాటిని కూడా మనవల్ల కాదులే అంటూ ఊదరగొడతాయి.

దాంతో మిగిలినవీ ప్రయత్నాన్ని విరమించుకుంటాయి.ఈ గొడవేమీ విన్ఫించని

చెవిటి కప్ప మాత్రం ఎగురుతూనే ఉంటుంది. చివరికి బయటపడుతుంది. 

మనవల్ల కాదు అన్నమాట వినబడకపోవడంవల్లే అది గెలుస్తుంది. ఈ విషయంమీద

డాక్టర్‌ మసారు ఎమోటో అనే శాస్త్రవేత్త ఓ పరిశోధన చేశారు. మనిషి శరీరంలో అరవైశాతం

దాకా నీళ్లే ఉంటాయి కాబట్టి నీటితోనే ఆయన ఈ ప్రయోగం చేశారు. రెండు వేర్వేరు

పాత్రల్లో నీరు తీసుకుని ఒకదానికి రోజూ చెడు మాటలూ తిట్లూ వినిపించేవారు.

ఇంకో దానికి ప్రోత్సాహకరమైన, ప్రేమపూర్వకమైన మాటలూ పాటలూ విన్పించారు.

కొన్నాళ్ల తర్వాత ఆ నీటిని గడ్డకట్టేలా చేసి కణాలను సూక్ష్మదర్శినితో పరిశీలిస్తే

మంచి మాటలు విన్న పాత్రలో నీటి కణాలు అందంగా, ఆర్గనైజ్డ్‌ రూపాల్లో ఏర్పడగా,

తిట్లూ శాపనార్థాలూ విన్న పాత్రలోని నీటి కణాలు ఒక ఆకృతి అంటూ లేకుండా

వికారంగా తయారయ్యాయట.


అందుకే శరీరంలోని కణాలకు కూడా మంచి సూచనలు ఇవ్వండి,ప్రోత్సహించండి,

లబ్ధిపొందండి... అంటున్నారు శాస్త్రవేత్తలు. శరీరంలోని ఏ అవయవంలోనైనా

సమస్య ఉందనిపిస్తే దాన్ని మరమ్మతు చేయమని అక్కడి కణాలకు సూచనలు

ఇవ్వవచ్చు. స్నేహితుడితో మాట్లాడినట్లే మీ శరీరంతో మాట్లాడండి. 

మెదడు, కాలేయం, గుండె... ఇలా ఆయా అవయవాల పనితీరుకు తగినట్లు అక్కడి

కణాలుంటాయి. అవన్నీ కూడా మనం ఇచ్చే ఆజ్ఞ శిరసావహించడానికి సిద్ధంగా ఉంటాయి.

కాబట్టి వాటికి సానుకూలమైన ఆలోచనల్ని చేరవేయండి. కణాల ఆరోగ్యానికి మంచి ఆహారం

ఎంత అవసరమో అవి చురుగ్గా పనిచేయడానికి మంచి ఆలోచనలూ అంతే అవసరం.

 

పాజిటివ్ మాట్లాడండి... ప్రతి అణువూ వింటుంది! 

(6 వ భాగము) ఈనాడు సౌజన్యం తో

శరీరం పట్ల మన ధోరణినీ మార్చుకోవాలంటారు నిపుణులు. ఎవరికి వారు

'నేను బలహీనంగా ఉన్నాను' అనుకుంటే... అలాగే ఉంటారట. అలసిపోయాను

అనుకుంటే అణువణువూ ఆ అలసటని ప్రతిబింబిస్తుంది. అలాకాకుండా ఈరోజు

చాలా పని చేశాను, శరీరం నాకు సహకరించింది. ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకుంటే

సరిపోతుంది... అని చెప్పుకోండి. అలసట హుష్‌కాకి అవుతుంది. కణాలన్నీ ఉత్తేజాన్ని

నింపుకుంటాయి. ఏ పరిస్థితిని అయినా మనం చూసే ధోరణి మారాలి. శరీరంలోని అన్ని

భాగాల్లో ఉన్న కణాలనూ నియంత్రించే శక్తి మెదడుకు ఉంది. అది చెప్పినట్లే

అన్నీ సమన్వయంతో పనిచేస్తాయి. ఆ మెదడుని మనం సానుకూల దృక్పథంతో

ప్రోగ్రామ్‌ చేయాలి... అని సూచిస్తున్నారు పరిశోధకులు.


కణాలన్నీ నిరంతరం మెదడు నుంచి సూచనలు అందుకుంటూ, మిగతా భాగాలకు

పంపుతూ ఉంటాయి కదా. ఆ క్రమంలో ఏదైనా ఒక్క కణం గాడి తప్పి సరైన

సమయానికి సూచనలు పంపకపోతే..? పంపాల్సిన కణాలకి కాకుండా వేరే వాటికి పంపితే..?

ఒకవేళ తనకి వచ్చిన సూచనలకు తగినట్లుగా ఏదైనా కణం స్పందించకపోతే..? 

అసలే సూచనా అందకుండానే ఒక కణం అతిగా స్పందిస్తే..? ఇలాంటి ఒక్కో పొరపాటు

ఒక రోగానికి కారణం కావచ్చు. ఉదాహరణకి ఒకటి చూద్దాం.


మనం తినే ఆహారం చక్కెర(గ్లూకోజు)గా మారి రక్తంలో కలుస్తుంది. సాధారణంగా

క్లోమగ్రంథిలోని కణాలు రక్తం ద్వారా ఇన్సులిన్‌ రూపంలో ఒక సిగ్నల్‌ పంపుతాయి.

కాలేయం, కండరాలూ ఇతర కొవ్వుకణాలకు ఈ చక్కెరను భవిష్యత్‌ ఉపయోగానికి

దాచుకోమని చెప్పే సూచన అది. క్లోమగ్రంథిలోని కణాలు ఆ సిగ్నల్‌ పంపకపోతే... 

ఇన్సులిన్‌ అందాల్సిన వాటికి అందదు. అవి చక్కెరను గ్రహించవు. దాంతో రక్తంలో

చక్కెర ఎక్కువగా ఉండిపోతుంది. అదే మధుమేహానికి దారితీస్తుంది.


పాజిటివ్ మాట్లాడండి... ప్రతి అణువూ వింటుంది! 

(7 వ భాగము) ఈనాడు సౌజన్యం తో 


కొందరికి శరీరంలో ఏదో ఒక భాగం బలహీనంగా ఉండవచ్చు. దానివల్లే తరచూ అనారోగ్యం 

తలెత్తుతుండవచ్చు. అటువంటప్పుడు ఆ భాగంతో తరచూ మాట్లాడాలి. అజీర్తి సమస్యే

ఉంటే కడుపుకి చెప్పండి. "ఈరోజు నేను నిన్ను నొప్పించను. నీకు తేలిగ్గా ఉండే ఆహారమే 

తీసుకుంటాను. ప్రశాంతంగా నీ పనిచేసుకో...” అని చెప్పండి. ఎప్పుడైతే మన శరీరంలోని

అవయవం మీద దృష్టిపెట్టి మనం ఇలా ఆలోచిస్తామో అప్పుడు నిజంగానే వాటిని మనం

ఎంత ఇబ్బంది పెడుతున్నామో అర్ధమవుతుంది. ఆఫీసులో రోజూ రెండు గంటలు

ఎక్కువసేపు పనిచేయండి అంటే మీరు ఇష్టంగా చేస్తారా? రూల్స్‌ మాట్లాడతారు,

ఎక్కువ జీతం ఇవ్వమంటారు. మరి మన అవయవమూ అంతే కదా, అది పనిచేయడానికి

ఒక పద్ధతీ సమయమూ ఉంటాయి. అవేవీ పట్టించుకోకుండా మనకి నచ్చిన పదార్థాలని,

నచ్చిన సమయంలో నచ్చిన మోతాదులో తినేస్తే అదెలా తట్టుకోగలుగుతుంది? 

ఈ అవగాహన వస్తే ఆహారపుటలవాట్ల మీద నియంత్రణ పాటించగలుగుతాం.

పొట్ట కణాల్ని సుఖపెట్టగలుగుతాం. అలాగే ఇతర అవయవాలూ అలవాట్లూ కూడా.

మన శ్రేయస్సు కోరి నిస్వార్ధంగా పనిచేసి పెట్టేవాళ్లు దొరకడం ఎంత కష్టం  ఈరోజుల్లో. 

అలాంటిది... బతిమిలాడకుండా, డబ్బుతో పనిలేకుండా కోట్ల కోట్ల కణాలు మనకి సేవ

చేయడానికి సిద్ధంగా  ఉన్నాయి. చేయాల్సిందల్లా  సానుకూల సంకేతాలు పంపడమే...

మరెందుకాలస్యం... 


ఇళ్లలో మనకి పనిచేసి పెట్టే పరికరాలు చాలానే ఉంటాయి. వాటిని ఎలా వాడతారు?

వాషింగ్‌మిషన్‌ పట్టనన్ని బట్టల్ని కుక్కితే అది తిరగనని మొరాయిస్తుంది. సరిగ్గా వాడకపోతే

ఫ్రిజ్‌ పనిచేయడం మానేస్తుంది. అందుకని వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. 

మరి అంత జాగ్రత్త శరీరం పట్ల తీసుకుంటున్నామా...? డబ్బు పెట్టి కొనుక్కునే పరికరాలు

పాడైపోతే కొత్తవి దొరుకుతాయి కానీ అవయవాల్ని కొనలేం. అందుకే ఆయా అవయవాలు

సరిగ్గా పనిచేయాలంటే వాటి కణజాలం ఆరోగ్యంగా ఉండాలి. కానీ కణాల ఆరోగ్యాన్ని

దెబ్బతీస్తున్నది మన అలవాట్లే. ఒత్తిడీ, ఆందోళనా మొత్తంగా శరీరంలోని కణాలన్నిటినీ

కుంచించుకుపోయేలా చేస్తాయి. వేళ తప్పి తీసుకునే ఆహారమూ, అతిగా తీసుకునే

శీతలపానీయాలూ, కాఫీలూ, టీలూ, తరచూ చేసే మద్యపానమూ మొత్తంగా జీర్ణవ్యవస్థా,

కాలేయాలలోని కణజాలాన్ని దెబ్బతీస్తాయి. 


తగినంత శారీరక వ్యాయామం లేకపోయినా, అతిగా చేసినా... కీళ్లూ కండరాల్లోని కణాలు

చాలినంత విశ్రాంతీ నిద్రా లేకపోతే మెదడు కణాల సామర్థ్యం తగ్గిపోతుంది. సిగరెట్‌ పొగా,

కాలుష్యమూ ఊపిరితిత్తుల కణజాలానికి శ్వాస ఆడనివ్వవు.  యాంటిబయోటిక్స్‌ లాంటివి అతిగా

వాడినా మొదట చెడిపోయేది కణజాలమే.


మనం ఇచ్చే సూచనలు కణాలు విన్నట్లే వాటి నుంచి వచ్చే సూచనలని మనమూ వినొచ్చు.

ధ్యానం గురించి చెప్పేవారంతా  "మీలోపలికి మీరు చూసుకోండి. శ్వాస మీదా, అవయవాల మీదా

ధ్యాస పెట్టండి"  అని చెప్పడంలో అర్థం అదే. మన మాటలు శరీరం విన్నంతగా శరీరం చెప్పేది

మనం వినడం లేదు. తలనొప్పిగా ఉంటే ఒక మాత్ర వేసుకుని పనిచేసుకుంటాం. 

ఒళ్లు వెచ్చబడితే ఇంకో మాత్ర, ఆవలింతలు వస్తుంటే నిద్ర వస్తోందనుకుని చల్లటి నీళ్లతో 

ముఖం కడుక్కొచ్చి మళ్లీ పని లేదా టీవీ చూడడంలో మునిగిపోతాం. అంతేకానీ దానికి కారణం

ఏమై ఉంటుందన్న ఆలోచనే రాదు. శరీరానికి చాలినంత నీరు అందకపోయినా, అజీర్తి చేసినా

తలనొప్పి వస్తుంది. తలనొప్పికి సవాలక్ష కారణాలుంటాయి. మనం వేసుకునే మాత్ర తలనొప్పిని

తగ్గిస్తుంది కానీ దానికి కారణమైన సమస్య అలాగే ఉంటుంది. మామూలు జ్వరం రెండు రోజులు

విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. ఆ అవకాశం కూడా ఇవ్వకుండా మాత్రలు మింగేస్తాం.

మెదడుకి ఆక్సిజన్‌ తక్కువైనా, ఉష్ణోగ్రత ఎక్కువైనా ఆవలింతలు వస్తాయి. ఉన్నచోటు నుంచి

లేచి, కాస్త తాజా గాలిని పీల్చుకుంటే సర్దుకుంటుంది. కానీ మనం మాత్రం సోఫాలోంచి కదలం.

ఇలాంటివే ఇంకా ఎన్నో సంకేతాలను శరీరం మనకు పంపిస్తూ ఉంటుంది. వాటిని అర్ధం చేసుకుని

 తగిన చర్య తీసుకోగలిగితే ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్లే. అందుకే మరి, శరీరం చెప్పేది

వినమనేది!


🙏🙏🙏సమాప్తం🙏🙏🙏

 

 మనిషి ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు నాలుగు.


1. ఎండార్ఫిన్స్.. Endorphins,
2. డోపామిన్.. Dopamine,
3. సెరిటోనిన్.. Serotonin,
4. ఆక్సిటోసిన్.. Oxytocin.


Endorphins: మనం ఏదైనా వ్యాయామం చేసినపుడు ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఈ

Endorphins మన శరీరం లో వ్యాయామం వలన కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి


Dopamine: నిత్య జీవితం లో ఎన్నో చిన్న పెద్ద పనులు చేస్తూ ఉంటాము. ఇవి వివిధ స్థాయిలలో

మనలో Dopamine హార్మోను ను విడుదల చేస్తాయి. దీని స్థాయిని పెంచుకోవడం వలన మనం

ఆనందం గా ఉంటాము.


Serotonin: ఇతరులకు సహాయం చేసినపుడు, వారికి మేలు చేసినపుడు ఈ సెరిటోనిన్ విడుదల

అవుతుంది. మనం స్నేహితులకు , సమాజానికి మేలు చేకూర్చే ఏదైనా మంచి పని చేసినపుడు

మనలో  ఈ Serotonin ఎక్కవగా విడుదల అవుతుంది.


Oxytocin: ఇది నిత్య జీవితంలో ఎదుటి మనిషిని దగ్గరికి తీసుకొని హత్తుకున్నప్పుడు బాగా

విడుదల అయ్యే హార్మోను. పిల్లలను, సమస్యలో ఉన్న వారిని భార్య లేదా భర్తను మనం దగ్గరకు

తీసుకునేటప్పుడు మనలో విడుదల అయ్యే హార్మోను.  ఎదుటివారిని దగ్గరికి తీసుకున్నప్పుడు 

లేదా ఆ లింగం చేసుకున్నప్పుడు ఎదుటివారిలో కూడా విడుదల అవుతుంది.

ఈ హార్మోనులు ఎక్కువ విడుదల అయ్యే వ్యక్తి ఎటువంటి అనారోగ్యాలకు లోనవడు. 

అలాగే ఎక్కువ కాలం ఆరోగ్యం గా జీవిస్తారు. ఈ హార్మోన్ల యొక్క లోపం వలన అనేక 

రకాలైనటువంటి అనారోగ్యాల బారిన మనం తరచూ  పడుతుంటాము.